రాష్ట్రాలకు 131 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు

రాష్ట్రాలకు 131 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు

దేశంలో కరోనా  కేసులు రోజురోజుకు  తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7 వేల 579 మందికి కరోనా  సోకినట్లు  కేంద్ర ఆరోగ్యశాఖ  ప్రకటించింది. ఇందులో సగం కేరళలోనే నమోదయ్యాయి. కేరళలో  ఒక్కరోజు 3వేల  698మందికి   పాజిటివ్ వచ్చింది. దేశంలో 543 రోజుల కనిష్ట స్థాయిలో  కరోనా కేసులు  నమోదయ్యాయి. తాజాగా కరోనా నుంచి 12 వేల 202 మంది కోలుకున్నారు.   వైరస్ కారణంగా  236 మంది  చనిపోయారు. ప్రస్తుతం దేశంలో లక్షా 13 వేల 584 యాక్టివ్  కేసులు ఉన్నాయి. యాక్టివ్  కేసుల సంఖ్య  ఒక శాతం లోపే ఉందని తెలిపింది  కేంద్ర ఆరోగ్యశాఖ.  రికవరీ రేటు  98.32 శాతంగా  నమోదు అయిందని తెలిపారు అధికారులు. 

ఇక దేశంలో  వ్యాక్సినేషన్   ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు  117 కోట్ల 63లక్షల వ్యాక్సిన్ డోసులు  పంపిణీ చేశారు. గత 24 గంటల్లో జనాలకు 71 లక్షల 92వేల 154 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు   తెలిపింది కేంద్ర   ఆరోగ్యశాఖ. మొత్తం 131 కోట్ల  45 లక్షల 3వేల 460 కరోనా వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత  ప్రాంతాలకు  అందజేశామని పేర్కొంది. ఇంకా 21 కోట్ల   92లక్షల 56వేల 121 డోసుల  వ్యాక్సిన్  రాష్ట్రాల దగ్గర  నిల్వ ఉందని తెలిపారు అధికారులు.