మే 1 నుంచి 18 ఏళ్లు దాటినవాళ్లందరికీ వ్యాక్సిన్

మే 1 నుంచి 18 ఏళ్లు దాటినవాళ్లందరికీ వ్యాక్సిన్

కరోనా ను అరికట్టడంలో భాగంగా కేంద్ర ప్రభత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వాళ్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మే1 నుంచి ఇండియాలో మూడో విడత వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఇవాళ(సోమవారం) వివిధ వర్గాలతో ప్రధాని మోడీ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఆ సమావేశాల్లో మూడో విడత కరోనా వ్యాక్సిన్ మార్గదర్శకాలను ప్రకటించారు ప్రధాని.

దేశవ్యాప్తంగా కరోనా ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తోంది. అయితే.. దీన్ని అడ్డుకోవడానికి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం ఒక్కటే మార్గమన్నారు ప్రధాని మోడీ. వీలైనంతన తక్కువ సమయంలో అందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించడంతో పాటు గతంలో ప్రకటించిన విధంగా  ఫ్రంట్ లైన్ వారియర్లకు,45 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ డ్రైవ్ ఎప్పటి లాగే కొనసాగుతుందన్నారు మోడీ.

దీంతో పాటు 50 శాతం వ్యాక్సిన్లను  అమ్ముకునేందుకు ఉత్పత్తి సంస్థలకు అనుమతిచ్చింది కేంద్రం. వీరు టీకాలను మార్కెట్లో నిర్దేశిత ధరకు అమ్ముకోవచ్చని తెలిపింది. అంతేకాదు ఉత్పత్తి సంస్థల నుంచి వ్యాక్సిన్లను నేరుగా కొనేందుకు రాష్ట్రాలకు పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ సీఎంలు కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తులు చేశారు. పరిస్థితి తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.