ప్రతీ రోజు వంద మందికి కరోనా వ్యాక్సిన్

ప్రతీ రోజు వంద మందికి కరోనా వ్యాక్సిన్

ఢిల్లీలో  కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌ జనవరి 16 నుంచి ప్రారంభమవుతుందని ఆ రాష్ట్ర సీఎం  అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వారానికి నాలుగు రోజులు… సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం వ్యాక్సిన్‌లు వేస్తారని ఇవాళ(గురువారం) చెప్పారు. జనవరి 16న ఢిల్లీలోని 81 ప్రాంతాల్లో వ్యాక్సిన్లు వేయనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో రోజుకు 100 మంది చొప్పున.. వారానికి నాలుగు రోజులలో టీకాలు వేయడం జరుగుతుందన్నారు.

ఇప్పటివరకు… కేంద్రం నుంచి రాష్ట్రానికి 2,74,000 డోసుల వ్యాక్సిన్‌లు వచ్చాయని తెలిపారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ప్రతి వ్యక్తికి రెండు డోసులు ఇస్తామని…. ప్రస్తుతం 1,20,000 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌లు ఇవ్వనున్నట్లు తెపారు. అందువల్ల 2,74,000 డోసులు సరిపోతాయన్నారు. త్వరలో ఢిల్లీలో వ్యాక్సిన్‌ సెంటర్ల సంఖ్యను 1,000కి పెంచుతామన్నారు. మొదట 81 కేంద్రాలతో ప్రారంభించామన్న కేజ్రీవాల్.. మరికొద్ది రోజుల్లో వాటిని 175కి.. ఆ తర్వాత ఢిల్లీ అంతటా 1,000 కేంద్రాలకు పెంచుతామన్నారు.