10 వేల మందిపై వ్యాక్సిన్‌‌ ట్రయల్స్‌‌

10 వేల మందిపై వ్యాక్సిన్‌‌ ట్రయల్స్‌‌

త్వరలోనే ఆక్స్‌‌ఫర్డ్‌‌ రెండో దశ ప్రయోగం స్టార్ట్‌‌
మూడో ఫేజ్‌‌ కూడా ఉంటుందన్న వర్సిటీ
ఫస్ట్‌‌ ఫేజ్‌‌లో వెయ్యి మందిపై ట్రయల్స్‌‌ సక్సెస్‌‌

లండన్‌‌: ఆక్స్‌‌ఫర్డ్‌‌ యూనివర్సిటీ వ్యాక్సిన్‌‌ ట్రయల్స్‌‌ స్పీడు పెరుగుతోంది. ఇప్పటికే తొలిదశలో 1,000 మందిపై ప్రయోగం చేసిన వర్సిటీ ఇప్పుడు రెండో దశలో 10,260 మందిపై టెస్టు చేయబోతోంది. త్వరలోనే ప్రయోగం స్టార్టవుతుందని వర్సిటీ వెల్లడించింది. తొలి దశలో కొంత రేంజ్‌‌ వరకు ట్రయల్స్‌‌ జరిగాయని, పూర్తిగా సక్సెస్‌‌ అయ్యామని పేర్కొంది. ఇప్పుడు పరిధిని పెంచుతున్నామని.. ఈ దశలో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అన్ని వయసుల వాళ్లపై ప్రయోగం చేస్తామంది. మూడో ఫేజ్‌లో 18 ఏండ్ల వాళ్లపై వ్యాక్సిన్‌‌ ఎంతలా ప్రభావం చూపిందో అనలైజ్‌‌ చేస్తామని చెప్పింది. యూకేకు చెందిన బయోఫార్మాసూటికల్‌‌ కంపెనీ ఆస్ట్రజెనెకాతో కలిసి ఆక్స్‌‌ఫర్డ్‌‌ వర్సిటీ రీసెర్చ్‌‌ టీమ్‌‌ పని చేస్తోంది. కరోనాకు వ్యాక్సిన్‌‌ డెవలప్‌‌ చేసి పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్లాన్‌‌ చేస్తోంది. 40 కోట్ల డోసుల ఉత్పత్తికి ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన బయోమెడికల్‌‌ అడ్వాన్స్డ్‌‌ రీసెర్చ్‌‌ అండ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ నుంచి రూ. 7,500 కోట్లను ఆస్ట్రజెనెకా ఫండ్‌‌గా పొందింది.

ఇమ్యూన్‌‌ సిస్టమ్‌‌ను బాడీనే డెవలప్‌‌ చేసుకునేలా..
ప్రపంచవ్యాప్తంగా 12 రకాల వ్యాక్సిన్‌‌ ట్రయల్స్‌‌ తొలిదశలో ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా చైనా, అమెరికా, యూరప్‌‌లలో జరుగుతున్నాయి. ఇంకా చాలా దేశాలు వ్యాక్సిన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌లో తలమునకలై ఉన్నాయి. వైరస్‌‌ను మన ఇమ్యూన్‌‌ సిస్టమ్‌‌ గుర్తించి దాడి చేసేలా చాలా వరకు వ్యాక్సిన్స్‌‌ను రెడీ చేస్తున్నారు. ఆక్స్‌‌ఫర్డ్‌‌ మాత్రం హాని చేయని కరోనా వైరస్‌‌ పీస్‌‌ను మనిషిలోకి పంపి మన బాడీనే ఇమ్యూనిటీని పెంచుకునేలా డిజైన్‌‌ చేస్తోంది.

For More News..

రోకళ్లు పగిలేలా దంచికొడుతున్నఎండలు

వీసా ఆంక్షలను సడలించిన కేంద్రం

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమెజాన్‌లో కొలువుల జాతర