18 ఏళ్లలోపు పిల్లలపై మొదలైన ట్రయల్స్

18 ఏళ్లలోపు పిల్లలపై మొదలైన ట్రయల్స్

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుండటంతో.. మొదటగా 45 ఏళ్లు పైబడిన వారందిరికీ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఆ తర్వాత 18 ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ మొదలుపెట్టారు. అయితే తాజాగా 18 ఏళ్ల లోపు పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని ఎయిమ్స్ నిర్ణయించింది. అందులో భాగంగా.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో  12 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల వారిపై భారత్ బయోటెక్‌ వారి కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఇందుకోసం 20 నుంచి 30 మంది పిల్లలను ఎంపికచేశారు. అయితే వీరందరూ మైనర్లు కావడంతో వీరి తరపున వీరి తల్లిదండ్రుల చేత అనుమతి పత్రాల మీద సంతకాలు తీసుకున్నారు. ఈ పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు కోవిడ్ టెస్ట్ నిర్వహించారు. ఆ సమయంలో వీరంతా తగినన్ని యాంటీబాడీస్ కలిగి ఉన్నారు.

ఈ విషయంపై ఎయిమ్స్‌లో వ్యాక్సిన్ ట్రయల్ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్ రాయ్ మాట్లాడారు. స్క్రీనింగ్ క్లియర్ చేసిన పిల్లలందరికీ కోవాక్సిన్ మొదటి డోసు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.