కరోనాను ఎదుర్కోవడానికి ఓ డ్ర‌గ్ కంపెనీ కొత్త ఐడియా

కరోనాను ఎదుర్కోవడానికి ఓ డ్ర‌గ్ కంపెనీ కొత్త ఐడియా

లండన్: కొవిడ్–19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ఫార్మా కంపెనీలు అనేక మార్గాలను వెదుకుతున్నాయి. ఇందులో భాగంగా యూకేలో ఉంటున్న ఓ ఇండియన్​ ఎంట్రెప్రెన్యూర్ కు చెందిన ఇజానా బయోసైన్స్ అనే కంపెనీ కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు వాడే డ్రగ్ ను కరోనా రోగులపై పరీక్షిస్తోంది. కొవిడ్ వ్యాప్తితో అల్లాడుతున్న ఇటలీలోని హాస్పిటల్స్ లో పేషెంట్లపై యాంటీ జీఎం డ్రగ్ ను టెస్ట్​ చేస్తోంది. కరోనా పేషెంట్లకు యాంటీ జీఎంసీఎస్ఎఫ్, నమీలుమాబ్ తో ట్రీట్ మెంట్ అందిస్తున్నామని ఆ సంస్థ సీఈఓ సమిత్ సిద్ధు చెప్పారు.

రోగనిరోధక శక్తికి సంబంధించిన వ్యాధులను నయం చేయడంలో జీఎంసీఎస్ఎఫ్ బాగా పనిచేస్తుందన్నారు. వైరస్ కు వ్యతిరేకంగా రోగ నిరోధక వ్యవస్థలు ప్రతిస్పందించే తీరును మార్చే శక్తి ఈ డ్రగ్ కు ఉందన్నారు. దీనికి సంబంధించిన టెస్టింగ్ ప్రోగ్రామ్స్ ను హ్యూమానిటీస్ రీసెర్చ్​ హాస్పిటల్ లో ప్రొఫెసర్ కార్లో సెల్మీ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.