డిగ్రీ కాలేజీలో 75 మందికి కరోనా

డిగ్రీ కాలేజీలో 75 మందికి కరోనా

కోరుట్ల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల అయ్యప్పగుట్ట దగ్గరున్న గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ స్టూడెంట్లు, సిబ్బంది 75 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి  డా.శ్రీధర్ చెప్పారు. డిగ్రీ  చదువుతున్న వివిధ గ్రామాలకు చెందిన 280 మంది స్టూడెంట్లకు శనివారం కరోనా పరీక్షలు చేశారు. 67 మంది స్టూడెంట్లకు, 8 మంది స్టాఫ్ కి కరోనా సోకినట్లు తేలింది. గత సోమవారం డిగ్రీ మొదటి సంవత్సరం స్టూడెంట్స్ 258 మంది కాలేజ్ కి వచ్చారు. వీరికి కాలేజ్ లో బుక్స్ ఇచ్చి క్లాసులు నిర్వహించారు. వీరిలో కొందరికి జ్వరం రావడంతో అనుమానంతో కరోనా టెస్టులు చేశారు. స్టూడెంట్లకు స్థానిక హాస్టల్ రూమ్​లలో ఐసోలేషన్ సదుపాయాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామని జిల్లా వైద్యాధికారి శ్రీధర్ చెప్పారు. మున్సిపల్​కమిషనర్ అయాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది హాస్టల్​లో శానిటేషన్ పనులు చేపట్టారు. స్టూడెంట్లకు పాజిటివ్​అని తేలడంతో అధికారులు హుటాహుటిన తల్లిదండ్రులను పిలిపించి ఇళ్లకు పంపించేశారు. పాజిటివ్ వచ్చిన స్టూడెంట్లను ఐసోలేషన్ కు తరలించకుండా ఇండ్లకు పంపడంపై జిల్లా వైద్యాధికారి అసహనం వ్యక్తం చేశారు. రూల్స్​కు విరుద్ధంగా రెండు నెలలుగా 200 మంది సీనియర్​స్టూడెంట్లకు క్లాసులు నిర్వహిస్తున్నారని, తాము ఎంత చెప్పినా అధికారులు వినిపించుకోలేదని సిబ్బంది వాపోయారు. ఇప్పుడూ తమకు కరోనా సోకడంతో ఇంటికి వెళ్లాలో, ఇక్కడే ఉండాలో తేల్చుకోలేని అయోమయ పరిస్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

For More News..

మంత్రి పేర్ని నానిపై దాడి.. నిందితుడిని పట్టుకున్న సిబ్బంది

కేసీఆర్, కేటీఆర్ ప్రజల సొమ్మును దోచుకుతింటున్నారు

తొమ్మిది రోజుల్లో ఎనిమిది సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు