
- ధర్మదర్శనానికి 2 గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట సమయం
- ఆదివారం ఆలయానికి రూ.53.64 లక్షల ఆదాయం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణాలు రద్దీగా కనిపించాయి. స్వామివారి ధర్మదర్శనానికి రెండు గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట సమయం పట్టింది. భక్తులు జరిపించిన పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఒక్కరోజే ఆలయానికి రూ.53,64,989 ఆదాయం వచ్చింది. ఇందులో ప్రసాద విక్రయం ద్వారా రూ.20,48,470, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6,22,500, వీఐపీ దర్శనాల ద్వారా రూ.12 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.5,55,900 ఇన్‌కం వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు.