షార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌తో మంటలు.. బాలిక సజీవదహనం

షార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌తో మంటలు.. బాలిక సజీవదహనం
  • నారాయణపేట జిల్లా మక్తల్‌‌‌‌లో విషాదం

మక్తల్, వెలుగు : షార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌ కారణంగా ఇంటికి మంటలు అంటుకోవడంతో ఓ బాలిక సజీవ దహనమైంది. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్‌‌‌‌ పట్టణంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మక్తల్‌‌‌‌ పట్టణంలోని నందినగర్‌‌‌‌కు చెందిన సుజాత, కృష్ణకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. పెద్దకుమార్తె భానుప్రియ (12) మూగ, అంధురాలు. ఆదివారం కుటంబసభ్యులంతా 
బయటకు వెళ్లడంతో భానుప్రియ ఒక్కతే ఇంట్లో ఉంది. 

ఈ టైంలో షార్ట్ సర్క్యూట్‌‌‌‌ కారణంగా లేచిన మంటలు ఇంటికి అంటుకున్నాయి. అంధురాలైన భానుప్రియ మంటలను గమనించకపోవడంతో ఇంట్లోనే సజీవ దహనమైంది. గమనించిన స్థానికులు ఫైర్‌‌‌‌ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వారు ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.