హైదరాబాద్‌లో విస్తరిస్తున్న కరోనా

హైదరాబాద్‌లో విస్తరిస్తున్న కరోనా

లాక్డౌన్ సడలింపులతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు విస్తరిస్తున్నాయి. జియాగూడలో ఒక వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. అతని తల్లి ఖైరతాబాద్ బీజేఆర్ నగర్‌లో నివసిస్తోంది. ఆమె ఆరోగ్యం బాగాలేకపోవడంతో అతని కుటుంబం పీజేఆర్ నగర్‌కు వచ్చింది. వృద్ధురాలు రెండు రోజుల క్రితం చనిపోవడంతో ఆమెకు కరోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్ వచ్చింది. దాంతో ఆమె ఇంటికి వచ్చిన వారందరినీ టెస్ట్ చేస్తే ఒకేసారి ఎనిమిది కేసులు బయటపడ్డాయి. వీరంతా కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. దాంతో వీరిద్వారా ఎంతమందికి కరోనా సోకిందనేది పెద్ద సవాల్‌గా మారింది. జియాగూడ, బీజేఆర్ నగర్‌లలో స్థానికులు త్రీవ భయాందోళనలకు గురవుతున్నారు. కూరగాయల వ్యాపారుల నుంచి ఎవరెవరు కూరగాయలు కొన్నారో వారందరినీ ట్రేస్ చేసే పనిలో బల్దియా అధికారులు బీజీ అయ్యారు. ఆ ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి అధికారులు సర్వే చేస్తున్నారు. హైడెన్సిటీ ఉన్న ప్రాంతం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఒకేసారి ఎనిమిది కేసులు నమోదవడంతో బీజేఆర్ నగర్‌లో కంటెయిన్‌మెంట్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఆ క్లస్టర్‌ను డిప్యూటీ కమీషనర్ గీత పరిశీలించారు.

For More News..

ఛత్తీస్‌గడ్ మాజీ సీఎం కన్నుమూత

కరోనా దెబ్బకు డీడీ న్యూస్ మూసివేత

నాలుగేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. ఇప్పుడు ఆత్మహత్య