ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సిన్ ధ‌ర ఎంత ఉంటుందంటే

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సిన్ ధ‌ర ఎంత ఉంటుందంటే

ప్ర‌పంచ దేశాల్ని క‌రోనా వైర‌స్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వైర‌స్ దాటికి జ‌న‌వ‌రి నుంచి అక్టోబ‌ర్ 30వ‌ర‌కు ఈ వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు 4.5కోట్ల మంద‌కి సోక‌గా..11ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు.

అయితే దీనికి విరుగుడు కోసం ప‌లు దేశాల‌కు చెందిన సైంటిస్ట్ లు వ్యాక్సిన్ పై ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఈ ప్ర‌యోగాలు చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా..2021నాటికి అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యాక్సిన్ ధ‌ర ల‌క్ష‌లు, వేలు , వంద‌ల్లో ఉంటుద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ ప్ర‌చారంపై భార‌త్ కు చెందిన దిగ్గ‌జ ఫార్మ‌కంపెనీ అధినేత‌ స్పందించారు. ఇది అఫిషియల్ కాక‌పోయినా ప్ర‌పంచ వ్యాప్తంగా డబుల్ డోస్ వ్యాక్సిన్ ధ‌ర రూ. 450 నుంచి రూ.5,500వ‌ర‌కు ఉండొచ్చ‌ని అంచ‌నా వేశారు.

మ‌రోవైపు ఫార్మా కంపెనీ మోడ్రేనా ప్ర‌పంచ వ్యాప్తంగా సింగల్ డోస్ వ్యాక్సిన్ ను రూ.2738కే అమ్ముతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక వ‌ర‌ల్డ్ లార్జెస్ట్ వ్యాక్సిన్ మేక‌ర్ సీర‌మ్ ఇండియా త‌యారు చేస్తున్న ఆస్ట్రాజెన‌కా రెండు డోసుల వ్యాక్సిన్ ధ‌ర రూ.700 నుంచి రూ.2000వేల వ‌ర‌కు ఉండొచ్చంటూ ఇండియాకు చెందిన దిగ్గ‌జ ఫార్మా సంస్థ అధినేత అభిప్రాయం తెలిపారు.