అధికారులు మాట వినట్లేదని చెరువులో దూకబోయిన కార్పొరేటర్

అధికారులు మాట వినట్లేదని చెరువులో దూకబోయిన కార్పొరేటర్

మల్కాజిగిరి, వెలుగు: మున్సిపల్​ అధికారులు తనను ఖాతరు చేయడం లేదని ఓ కార్పొరేటర్​ చెరువులో దూకబోయాడు. మల్కాజిగిరిలోని 140వ డివిజన్  కార్పోరేటర్ శ్రవణ్  కొన్ని రోజులుగా మునిసిపల్​ అధికారుల తీరుపై అసంతృప్తితో ఉన్నాడు. వారి తీరును నిరసిస్తూ గురువారం సఫిల్ గూడ చెరువులో దూకబోయాడు. పక్కనే ఉన్న వాళ్లు ఆయనను రక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నిధులతో చెరువును శుభ్రంగా చేయాలని చెబుతుంటూ అధికారులు వినడం లేదన్నారు. అందుకే ఇలా నిరసన తెలిపినట్లు చెప్పాడు.