IIMRలో ఇంటర్వ్యూలు.. డిగ్రీ చదివితే చాలు.. ఎగ్జామ్ లేకుండానే జాబ్..

IIMRలో ఇంటర్వ్యూలు.. డిగ్రీ చదివితే చాలు.. ఎగ్జామ్ లేకుండానే జాబ్..

ఐసీఏఆర్ ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ICAR IIMR) సీనియర్ రీసెర్చ్ ఫెలో/యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు  ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌ను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 24.

పోస్టులు: 05.

పోస్టుల సంఖ్య: సీనియర్ రీసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్), యంగ్ ప్రొఫెషనల్-II (వైపీ II), యంగ్ ప్రొఫెషనల్-I (వైపీ-I).

ఎలిజిబిలిటీ
ఎస్ఆర్ఎఫ్: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ జెనెటిక్స్/ప్లాంట్ బ్రీడింగ్/బయోటెక్నాలజీ/బయోఇన్ఫర్మేటిక్స్/లైఫ్ సైన్సెస్/ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ/అగ్రి బిజినెస్), నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా నెట్ అర్హత కలిగిన మూడేండ్ల బ్యాచిలర్ డిగ్రీ + రెండేండ్ల పీజీ లేదా పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వైపీ -II: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, నెట్ లేకుండా మూడేండ్ల  బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా అర్హులే.

వైపీ -I: సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేట్. 

వయోపరిమితి
ఎస్ఆర్ఎఫ్:  గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. 

వైపీ II & వైపీ-I: గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: నవంబర్ 24.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: నవంబర్ 25న, ఐసీఏఆర్–ఐఐఎంఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్ 500030లో నిర్వహించనున్నారు. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.millets.res.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.