బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీల గొడవ..

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీల గొడవ..

హైదరాబాద్ బంజార హిల్స్ తాజ్ కృష్ణ చౌరస్తాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల వివాదం రాజుకుంది.  కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న CWC మీటింగ్ తాజ్ కృష్ణలో జరుగుతోంది. అయితే తాజ్ కృష్ణ హోటల్ ముందు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ తొలగించారు. 

తన ఫ్లెక్సీలను తొలగిస్తున్నారన్న సమాచారంతో తాజ్ కృష్ణ హోటల్ దగ్గరకు వచ్చారు కార్పొరేటర్ విజయారెడ్డి. బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలను ఎందుకు తొలగించడం లేదు..తన ఫ్లెక్సీలను మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు. ఫ్లెక్సీలను తొలగించ వారిని గుర్తించి వారి చేతనే  ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్  ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫ్లెక్సీలను తీయించారు. దీంతో  స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తన ఫ్లెక్సీలను తీయించారని కార్పొరేటర్ విజయారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ , ఇతర పార్టీల ఫ్లె్క్సీలను ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు ఒక న్యాయం..కాంగ్రెస్ కు ఒక న్యాయమా అని నిలదీశారు.