అవినీతి చేస్తే సహించేదిలేదు : కడియం శ్రీహరి

అవినీతి చేస్తే సహించేదిలేదు : కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్​పూర్/ ధర్మసాగర్, వెలుగు: స్టేషన్​ ఘన్​పూర్​లో నిజాయతీతో కూడిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, బంధువైనా, పార్టీ నాయకుడైనా అవినీతి చేస్తే సహించేదిలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ మండలం శివునిపల్లిలో 35 మంది లబ్ధిదారులకు రూ. 35,04,060 విలువచేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను సోమవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం రూ.40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ధర్మసాగర్​మండలం మల్లక్​పల్లి, సాయిపేట, ధర్మసాగర్​లలో మృతి చెందిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే కడియం పరామర్శించారు.