
- చేర్యాలలో అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల సహాయ నిరాకరణ
చేర్యాల, వెలుగు: చేర్యాల మున్సిపల్కౌన్సిల్జనరల్బాడీ మీటింగ్‌కు చైర్పర్సన్స్వరూపరాణి శ్రీధర్‌రెడ్డి తప్ప 11 మంది కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. మంగళవారం మున్సిపల్ఆఫీస్లోని మీటింగ్‌హాల్‌లో జనరల్ బాడీ మీటింగ్ఏర్పాటు చేశారు. వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డితో పాటు కౌన్సిలర్లు ఎవరూ హాజరు కాలేదు. కౌన్సిలర్లు అందరూ స్థానికంగా ఉన్నప్పటికీ ఒక్కరూ మీటింగ్‌కు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన మీటింగ్‌లో కేవలం చైర్పర్సన్స్వరూపరాణి, మున్సిపల్ కమిషనర్రాజేంద్రకుమార్ అరగంటపాటు వేచి చూసి మీటింగ్రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా మున్సిపల్చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లలో ఆరుగురు మీటింగ్‌కు గైర్హాజరయ్యారు. చైర్‌పర్సన్‌ను ఏకాకిని చేసేందుకు కాంగ్రెస్కౌన్సిలర్లు ఐదుగురూ అటెండ్కాలేదు. రెండున్నర సంవత్సరాల తర్వాత మీకే చైర్పర్సన్ సీటు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని 7వ వార్డు కౌన్సిలర్ జుబేదా ఎగ్బాల్ ఎమ్మెల్యేతో అన్నట్లు సమాచారం.