రాచకొండ లో 188 మంది పోకిరీలకు కౌన్సెలింగ్​

 రాచకొండ లో 188 మంది పోకిరీలకు కౌన్సెలింగ్​
  • మహిళలను వేధించిన వారిలో 56 మంది మైనర్లు 

హైదరాబాద్​ సిటీ/ఎల్​బీనగర్​, వెలుగు: రాచకొండ కమిషనరేట్​విమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు గురువారం క్యాంప్ ఆఫీసులో కౌన్సెలింగ్​ఇచ్చారు. కమిషనరేట్​పరిధిలో మహిళలను, యువతులను వేధిస్తున్న 188(మేజర్లు-132 , మైనర్లు-56) మందిని షీ టీమ్స్ పట్టుకున్నాయి. వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చినట్టు విమెన్​సేఫ్టీ వింగ్​డీసీపీ ఉషారాణి  తెలిపారు. గత నెలలో  225  ఫిర్యాదులు వచ్చాయని,  ఫోన్ల ద్వారా వేధించినవి -26,  సోషల్ మీడియా వేధింపులు 77, నేరుగా వేధించినవి  122 ఉన్నాయన్నారు.

కిందటి నెల రాచకొండ షీ టీమ్స్ 93 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, దాదాపు 17,420 మందికి  మహిళా చట్టాలు,  వారి  హక్కులు, నేరాలు  జాగ్రత్తల గురించి  వివరించామన్నారు. మహిళలు వేధిపులకు గురైతే.. 87126 62111కు కాల్​చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఇన్​స్పెక్టర్లు ఎం.ముని, జె.హనుమంతు, జి.అంజయ్య, అడ్మిన్ ఎస్సై రాజు, షీ టీమ్స్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది, కౌన్సిలర్స్ పాల్గొన్నారు.