మొదటి ఫలితం హుజూర్‌‌‌‌ నగర్ .. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం

మొదటి ఫలితం హుజూర్‌‌‌‌ నగర్ .. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
  • ముందుగా సర్వీస్ ఎలక్ట్రోరల్స్‌‌  ఓటర్లు, పోస్టల్‍ బ్యాలెట్ల లెక్కింపు
  • ఆ తర్వాత సాధారణ ఓటర్ల కౌంటింగ్‍
  • ఒక్కో నియోజకవర్గానికి 14  నుంచి 18 టేబుళ్లు ఏర్పాటు
  • మధ్యాహ్నం 2 గంటలోపు కౌంటింగ్‍ పూర్తి

నల్గొండ,  యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓట్ల కౌంటింగ్‌‌కు అంతా సిద్ధమైంది.  ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా  సర్వీస్‌‌ ఎలక్ట్రోరల్స్‌‌ ,  పోస్టల్‍ బ్యాలెట్ ఓట్లు జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో లెక్కిస్తారు.  తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేసి సెగ్మెంట్ల వారీగా ఏర్పాటు చేసిన టేబుళ్ల పై సాధారణ ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు.  నల్లగొండ జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని తిప్పర్తి మండలం అనిశెట్టిదప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో,  యాదాద్రి జిల్లాకు సంబంధించి భువనగిరిలోని ఆరోరా ఇంజినీరింగ్ కాలేజీలో, సూర్యాపేట జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని మార్కెట్‌‌ యార్డులో  ఏర్పాటు చేశారు. శనివారం ఈ  కౌంటింగ్ సెంటర్లను కలెక్టర్లు  ఆర్‌‌‌‌వీ కర్ణన్, వెంకట్‌‌రావు, ఎస్పీలు ఎస్పీ అపూర్వరావు, రాహుల్ హెగ్డె సందర్శించి.. సిబ్బందికి సూచనలు
 చేశారు.  

కౌంటింగ్‍ ఏర్పాట్లు పూర్తి

ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలత్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‍, బీజేపీ, సీపీఎం, ఫార్వర్డ్​ బ్లాక్​, బీఎస్పీతో పాటు రిజిస్టర్​ పార్టీలు, స్వతంత్రులతో కలిపి  276 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 30 పోలింగ్ జరగగా ఆదివారం కౌటింగ్  నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్‌‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపుగాను  ఒక్కో నియోజక వర్గానికి 14 నుంచి 18  టేబుళ్ల చొప్పున ఉమ్మడి జిల్లాలో 178 టేబుళ్లు ఏర్పా టు చేశారు.  ఒక్కో టేబుల్‍కు కౌంటింగ్‍సూపర్‍వై జర్‍, కౌంటింగ్‍అసిస్టెంట్‍, ఒక మైక్రో అబ్జర్వర్‍, అభ్యర్థి తరపున ఒక ఏజెంట్‍ ఉంటారు.  రెండు వేల మందికి పైగా అధికారులు, సిబ్బందిని నియమించారు.  మధ్యాహ్నం 2 గంటలోపు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు వెల్లడిస్తారు. 

మూడంచెల భద్రత ఏర్పాటు  

కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా పోలీస్‍ శాఖ ఆధ్వర్యంలో సివిల్‌‌, ఏఆర్‌‌‌‌ సిబ్బందితో పాటు  కేంద్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‍ఐలు, ఏఎస్సైలతో కానిస్టేబళ్లు, హోంగార్డులు  పాటు పారా మిలటరీ బలగాలను అదనంగా నియమించారు.  ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల కమిషన్‍ ఆదేశాల మేరకు ఆదివారం మద్యం దుకాణాలు బంద్​ చేయనున్నారు.  ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత అ భ్యర్థులు ఎలాంటి  సంబురాలు నిర్వహించేందుకు వీల్లేదు. 

18 రౌండ్లలో హుజూర్‌‌‌‌ నగర్ ఓట్ల లెక్కింపు పూర్తి

ఉమ్మడి జిల్లాలో హుజూర్‌‌‌‌ నగర్‌‌‌‌ ఫలితం మొదట వెలువడనుంది. ఈ ని యోజకవర్గంలో 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.  ఆ తర్వాత నల్గొండ జిల్లా మిర్యాలగూడ, సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, కోదాడ ,  యాదాద్రి జిల్లాలో భువనగిరి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 19 రౌండ్లలో పూర్తి చేస్తారు.  వీటి ఫలితాలు మధ్యాహ్నం కల్లా వచ్చే అవకాశం ఉంది.