నవంబర్ 10న హెచ్ సీయూ స్టూడెంట్ ఎన్నికల ఫలితాలు

నవంబర్ 10న హెచ్ సీయూ స్టూడెంట్ ఎన్నికల ఫలితాలు

హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్​సీయూ) 2023–24 స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 5,400 వరకు అర్హులైన ఓటర్లుండగా, 80%  ఓట్లు పోలైనట్టు అధికారులు ప్రకటించారు.

శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. కాగా, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఏఐఓబీసీఎస్ఏ, ఎన్ఎస్ యూఐ కూటములు పోటీ చేశాయి.  ఈ ఎన్నికలో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని స్టూడెంట్లు చెప్తున్నారు.