బెట్టింగ్ యాప్ లను కేంద్రం సమర్థిస్తుందా? : సుప్రీంకోర్టు

బెట్టింగ్ యాప్ లను కేంద్రం సమర్థిస్తుందా? : సుప్రీంకోర్టు
  • నోటీసులకు స్పందించకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్
  • కేఏ పాల్ పిటిషన్ పై విచారణ

న్యూఢిల్లీ, వెలుగు: ‘బెట్టింగ్ యాప్’లను కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుందా.. వ్యతిరేకిస్తుందా.. చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో గతంలో తామిచ్చిన నోటీసులకు స్పందించకపోవడాన్ని తప్పుబట్టింది. మరోసారి కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్‌‌‌‌ యాప్‌‌‌‌లపై కేఏ పాల్‌‌‌‌ ఈ ఏడాది మార్చి 26న సుప్రీంకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ ధర్మాసనం విచారించింది. కేఏ పాల్ స్వయంగా తన వాదనలు వినిపించారు. 

బెట్టింగ్ యాప్‌‌‌‌ల వల్ల రెండేళ్లలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పాల్ పేర్కొన్నారు. 25 మంది నటులు, ఇన్‌‌‌‌ఫ్లూయెన్సర్లు తమ స్వార్థం కోసం అమాయకుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని ఆరోపించారు. రెండేండ్లలో ఒక్క తెలంగాణలోనే సుమారు 1,023 మందికి పైగా ప్రాణాలు తీసుకున్నారని చెప్పారు. కేంద్రం వైఖరి తెలుసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నామన్న సుప్రీంకోర్టు.. నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.