నేరడిగొండ, వెలుగు: పశువులను ఎత్తుకెళ్లేందుకు వచ్చిన వ్యక్తులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతుపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్జిల్లా నేరడిగొండ మండలంలోని చించోలి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి చించోలి గ్రామంలోకి వచ్చి సీడం రవికి చెందిన ఎడ్ల జతను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఇంటి బయట అలికిడి విన్న రవి వచ్చి చూసి.. వారిని అడ్డుకునేందుకు యత్నించడంతో కత్తులతో దాడి చేశారు. దీంతో రవి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు నిద్ర లేచి రావడంతో దొంగలు పారిపోయారు. గాయపడిన రవిని హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
