చరిత్ర సృష్టించిన ఇండో అమెరికన్ ముస్లిం.. న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మమ్దానీ

 చరిత్ర సృష్టించిన ఇండో అమెరికన్ ముస్లిం.. న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మమ్దానీ

అమెరికాలో ఇండో అమెరికన్ ముస్లిం వ్కక్తి చరిత్ర తిరగరాశాడు. న్యూయార్క్ మేయర్ కోసం జరిగిన ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ భారీ విజయం సాధించి రికార్డు సృష్టించాడు. న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్ర్యూ క్యూమోపై గెలచి డెమొక్రాట్స్ కు భారీ విజయాన్నందించాడు. 

న్యూయార్క్ మేయర్ పీఠానికి జరిగిన ఎన్నికల్లో జోహ్రాన్ ప్రత్యర్థి ఆండ్రూ క్యూమోపై దాదాపు రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఈ ఎన్నికల్లో మొత్తం 75 శాతం ఓట్లు పోలవ్వగా అందులో జోహ్రాన్ మమ్దానీ10 లక్షల 22 వేల ఓట్లు ( 50.4 శాతం) సాధించాడు. ప్రత్యర్థి ఆండ్రూ క్యూమో 8 లక్షల 44 వేల ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 

అధికారానికి దూరంగా ఉన్న డెమొక్రాట్లకు అనూహ్య విజయాన్ని అందించిన జోహ్రాన్.. చిన్న వయసులో న్యూయార్క్ పీఠాన్ని అధిష్టించబోతున్న వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నాడు. న్యూయార్క్ మేయర్ గా 2026 జనవరి 1 న ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. 

గెలుపు తర్వాత జోహ్రాన్ ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. న్యూయార్క్ సబ్ వే ట్రైన్.. సిటీ హాల్ స్టేషన్ లో ఆగుతుండగా.. డోర్స్ ఓపెన్ అవుతుండగా.. జోహ్రాన్ ఫర్ న్యూయార్క్ సిటీ.. అనే టైటిల్స్ పడుతున్న వీడియో ను పోస్ట్ చేసి తన గెలుపును షేర్ చేసుకున్నాడు జోహ్రాన్.

న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా క్వీన్స్ బరోకు ప్రాతినిధ్యం వహించిన జోహ్రాన్..  ప్రసిడెంట్ ట్రంప్ విధానాలపై ఘాటైన విమర్శలతో ప్రజల్లో పాపులారిటీ సాధించాడు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న వినూత్న ప్రచారం ఆయనను ప్రజలకు చేరువ చేసింది. అద్దెను తగ్గించడం, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, పిల్లల సంరక్షణ వంటి ప్రాతిపాదనలతో ఎన్నికల్లో ర్యాలీల్లో ఆకట్టుకున్నాడు.