ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కుట్రలను సహించం: తెలంగాణ రెడ్డి సంఘాల డిమాండ్

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కుట్రలను సహించం: తెలంగాణ రెడ్డి సంఘాల డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పటిష్టంగా అమలుచేయాలని రెడ్డి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దీని కోసం జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అసత్య ప్రచారాలు, కుట్రలను సహించబోమన్నారు. ఓసీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, అన్ని పోటీ పరీక్షల్లో వయో పరిమితి సడలించాలని కోరారు.

రెడ్డి కార్పొరేషన్ కు నిధులు కేటాయించి పాలకమండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జనవరిలో లక్ష మందితో ఓసీ సింహ గర్జన సమరభేరి సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు రాంరెడ్డి, ఏనుగు సంతోష్ రెడ్డి, పైళ్ల హరి నాగిరెడ్డి, వెంకటేశ్​రెడ్డి, గోపు జైపాల్ రెడ్డి, ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, కాచం సత్యనారాయణ గుప్తా, మాధవరెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.