
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగర రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్తను తరలించేందుకు జీహెచ్ఎంసీ వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనుంది. మై జీహెచ్ఎంసీ యాప్ తో పాటు వాట్సాప్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం ప్రకటించారు. 81259 66586 వాట్సాప్ నంబర్‌కు ఫొటో, లొకేషన్ పంపితే అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.