ఫిబ్రవరిలో పెరిగిన ఎగుమతులు

ఫిబ్రవరిలో పెరిగిన ఎగుమతులు

న్యూఢిల్లీ :  దేశ ఎగుమతులు కిందటి నెలలో  41.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గూడ్స్‌‌‌‌, ఎలక్ట్రానిక్, ఫార్మా ప్రొడక్ట్‌‌‌‌ల ఎక్స్‌‌‌‌పోర్ట్స్ పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక నెలవారి ఎగుమతులను ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదు చేశాం. కిందటేడాది ఫిబ్రవరితో పోలిస్తే   ఎగుమతులు 11.9 శాతం పెరిగాయి.  దిగుమతులు కూడా 12.16 శాతం పెరిగి 60.11 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 

గోల్డ్ దిగుమతులు పెరగడంతో ఫిబ్రవరిలో ట్రేడ్ డెఫిసిట్‌‌‌‌ 18.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. కిందటేడాది ఫిబ్రవరిలో ట్రేడ్ డెఫిసిట్‌‌‌‌ 16.57 బిలియన్ డాలర్లుగా ఉంది. కిందటి నెలలో గోల్డ్ దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 2.63 బిలియన్ డాలర్ల నుంచి  134 శాతం పెరిగి 6.15 బిలియన్‌‌‌‌ డాలర్లకు చేరుకున్నాయి. కిందటేడాది ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య గోల్డ్ దిగుమతులు 44 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇదే టైమ్‌‌‌‌లో మొత్తం ఎగుమతులు 709.81 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 782.05 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. ట్రేడ్ డెఫిసిట్ మాత్రం 72.24  బిలియన్ డాలర్లకు తగ్గింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్‌‌‌‌లో  116.13 బిలియన్ డాలర్లుగా ఉంది.