మా భూమిని వేరొకరికి పట్టా చేశారు!.. మంచిర్యాలలో వాటర్ ట్యాంక్ ఎక్కి దంపతుల ఆందోళన

మా భూమిని  వేరొకరికి పట్టా చేశారు!.. మంచిర్యాలలో వాటర్ ట్యాంక్ ఎక్కి దంపతుల ఆందోళన

మంచిర్యాల, వెలుగు: మా భూమిని రెవెన్యూ అధికారులు వేరొకరి పట్టా చేశారని ఆరోపిస్తూ దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన దిగిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఐబీ ఏరియాకు చెందిన బొలిశెట్టి మహేశ్, కీర్తన దంపతులు తమ కొడుకు మహేశ్ తో కలిసి మంగళవారం వాటర్ ట్యాంక్ ఎక్కారు. హాజీపూర్ మండలం సబ్బపల్లి శివారులో  తన తల్లి, తమ్ముడి పేరిట ఉన్న భూమిని సావిత్రి అనే మహిళ పేరిట రెవెన్యూ అధికారులు అక్రమంగా పట్టా చేశారని మహేశ్ ఆరోపించారు. 

తన తమ్ముడు రాజేశ్ కు మానసిక స్థితి సరిగా లేదని తెలిసి, తల్లిని కొడుకులు చూసుకోవడం లేదని సాకుగా చూపుతూ.. తమ బంధువులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై భూమిని రాయించుకున్నారని వాపోయారు.  ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.  తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానికులు నచ్చజెప్పడంతో దంపతులు ట్యాంకు దిగి కిందకు వచ్చారు.