జగిత్యాల జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్ తో దంపతులు మృతి

V6 Velugu Posted on Aug 03, 2019

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ గురై గంగాధర్, లక్ష్మీ  దంపతులు చనిపోయారు. రాత్రి పోలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన గంగాధర్ స్నానం చేసి బట్టలు ఆరేసుకునే క్రమంలో ఇనుపతీగను పట్టుకున్నాడు. ప్రమాదవశాత్తు ఇనుపతీగకు విద్యుత్ సరాఫరా కావడంతో గంగాధర్ షాక్  కు గురయ్యాడు. భర్తను కాపాడే ప్రయత్నంలో లక్ష్మీ కూడా విద్యుత్ షాక్ గురైంది. దీంతో ఇద్దరు దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

Tagged electric shock, Jagitayal Dist., couples dead, farmer couple

Latest Videos

Subscribe Now

More News