పెండ్లికి రానోళ్లంతా రిసెప్షన్ బిల్లు కట్టాలంట!

పెండ్లికి రానోళ్లంతా  రిసెప్షన్ బిల్లు కట్టాలంట!


ప్రతీ ఒకరి జీవితంలో ఒక మధురానుభూతి పెండ్లి. ఆ వేడుక జీవితాంతం గుర్తుండిపోవాలని అనుకుంటారు. అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఇంట్లో వాళ్ల నుంచి, ఫ్రెండ్స్​, దూరపు చుట్టాల వరకు అందర్నీ ఆహ్వానిస్తారు. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే, పిలిచిన వాళ్లంతా పెళ్లికిరారు. అలాంటి వాళ్లకు షాక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది ఓ కొత్త జంట. ‘రిసెప్షన్‌‌‌‌‌‌‌‌ బిల్లు’ పేరుతో పెండ్లికి రాని వాళ్లందరికీ ఒక ఇన్‌‌‌‌‌‌‌‌వాయిస్‌‌‌‌‌‌‌‌ పంపింది. వెరైటీగా ఉంది కదా! 

నైజీరియాకి చెందిన ఒక జంట రిసార్ట్‌‌‌‌‌‌‌‌లో వెడ్డింగ్‌‌‌‌‌‌‌‌ రిసెప్షన్‌‌‌‌‌‌‌‌ Couple sends USD 240 invoice to guests who skipped their weddingపెట్టుకుంది. బంధువులు, ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ అందరినీ ఆ రిసెప్షన్‌‌‌‌‌‌‌‌కు పిలిచారు. గెస్ట్‌‌‌‌‌‌‌‌లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని, మంచి ఫుడ్‌‌‌‌‌‌‌‌ అందించాలనే ఉద్దేశంతో అన్ని ఎరేంజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అయితే, పిలిచినవాళ్లలో కొంతమంది రాలేదు. దీంతో వాళ్లకోసం చేసిన ఏర్పాట్లు వేస్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. అందుకే, రిసెప్షన్‌‌‌‌‌‌‌‌కు రాని వాళ్లందిరికీ ‘రిసెప్షన్‌‌‌‌‌‌‌‌ బిల్లు’ పంపారు ఆ జంట. అది కట్టేందుకు ఒక నెల టైం కూడా ఇచ్చారు. “ మీరు రిసెప్షన్‌‌‌‌‌‌‌‌కు వస్తారని ఉద్దేశంతో మీ పేరుతో సీట్స్‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌ చేశాం. కానీ, మీరు ముందస్తు ఇన్ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వకుండా ఆబ్సెంట్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. మీ కోసం ఖర్చుపెట్టిన డబ్బులు వేస్ట్‌‌‌‌‌‌‌‌ అయిపోయాయి. కాబట్టి ఆ డబ్బును పంపాలని కోరుతున్నాం. జీల్‌‌‌‌‌‌‌‌, పేపాల్‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఆ డబ్బులు పంపొచ్చు. థ్యాంక్యూ” అని ఒక ఇన్‌‌‌‌‌‌‌‌వాయిస్‌‌‌‌‌‌‌‌ పంపారు. అది ఎవరో ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో నెట్టింట్లో వైరల్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. ‘భలే ప్లాన్‌‌‌‌‌‌‌‌ వేశారు’ అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.