మగధ్​ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌ కప్లింగ్‌ బ్రేక్‌.. రన్నింగ్​ లో రెండు ముక్కలైంది..

మగధ్​ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌ కప్లింగ్‌ బ్రేక్‌..  రన్నింగ్​ లో రెండు ముక్కలైంది..

ట్రైన్‌ కంపార్ట్‌మెంట్స్‌ మధ్య కప్లింగ్‌ బ్రేక్ అయ్యింది. (Train Coupling Breaks) దీంతో ఆ రైలు రెండుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు భయాందోళన చెందారు. బీహార్‌లోని బక్సర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. న్యూఢిల్లీ నుంచి ఇస్లాంపూర్‌కు వెళ్తున్న మగద్‌ ఎక్స్‌ప్రెస్‌కు కప్లింగ్‌ తెగిపోయింది. దీంతో ట్వినిగంజ్‌, రఘునాథ్‌పూర్‌ రైల్వే స్టేషన్ల మధ్య ఆ రైలు రెండుగా విడిపోయింది. ఆదివారం ( సెప్టెంబర్​ 8)  ఈ సంఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని చెప్పారు. ‘రైలు ట్వినిగంజ్‌ స్టేషన్‌ దాటినప్పుడు ఈ సంఘటన జరిగింది. రైలు ఇంజన్ నుంచి 13, 14వ కంపార్ట్‌మెంట్స్‌ అయిన ఎస్‌-7, ఎస్‌-6 కోచ్‌ల మధ్య కప్లింగ్‌ బ్రేక్‌ అయ్యింది. ఆ రైలు రెండుగా విడిపోయింది’ అని ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్‌వో) సరస్వతి చంద్ర వెల్లడించారు.

ALSO READ | భారత్లో తొలి Mpox కేసు..? ఐసోలేషన్లో విదేశాలనుంచి వచ్చిన వ్యక్తి

ఇంజిన్ వైపున్న ట్రైన్ దూసుకుపోతుండగా.. కప్లింగ్ బ్రేక్ అయిన బోగీ నుంచి వెనుక ఉన్నవన్నీ నెమ్మదించాయి. ఈ విషయం తెలుసుకున్న లోకో పైలట్ వెంటనే సమీపంలోని రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించి ఇంజిన్‌ను మెల్లిగా నిలిపేశాడు. కప్లింగ్ బ్రేక్ కావడంతో ట్రైన్ రెండుగా విడిపోయిన ఈ ఘటన బిహార్‌లో ఆదివారం ( september 8)  చోటుచేసుకుంది.

.అనంతరం, అధికారులు ఈ ట్రైన్‌ను రఘునాథ్ పూర్ రైల్వే స్టేషన్‌కు రిపేర్ కోసం తరలించారు. రిపేర్ పూర్తి అయిన తర్వాత ట్రైన్ తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.దుమ్రాన్ డీఎస్పీ అఫక్ అక్తర్ అన్సారీ ఈ ఘటనపై మాట్లాడారు. ప్రమాదమేమీ జరగలేదని, కప్లింగ్ ఫెయిల్ కావడంతో ట్రైన్ రెండుగా విడిపోయిందని వివరించారు. ఆ తర్వాత వాటిని రఘునాథ్ పూర్ రైల్వే స్టేషన్‌కు తరలించినట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేవని తెలిపారు. కప్లింగ్ రిపేర్ చేసిన తర్వాత ట్రైన్ తన డెస్టినేషన్‌కు జర్నీ ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. . రైలు కప్లింగ్‌ బ్రేక్‌పై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటన వల్ల డౌన్‌లైన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు వివరించారు.