ఎన్ఎస్యూఐ నాయకులకు బెయిల్

ఎన్ఎస్యూఐ నాయకులకు బెయిల్

ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకులకు రిలీఫ్ దొరికింది. ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా 18 మంది విద్యార్థి సంఘం నాయకులకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. వారంతా సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నారు. 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా విశ్వవిద్యాలయ సందర్శనకు అనుమతించకపోవడంతో ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ ఈ నెల ఒకటో తేదీన మరికొందరు విద్యార్థి సంఘం నాయకులతో కలిసి ఓయూ వీసీ ఛాంబర్ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు ఆయనతో పాటు 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో బల్మూరి వెంకట్ సహా 18 మంది విద్యార్థి సంఘం నాయకులను చంచల్గూడ జైలుకు తరలించారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్న వారికి తాజాగా బెయిల్ ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

FOR MORE NEWS..

సంక్షేమ పథకాలకు డబ్బుల్లేవు.. కానీ కమీషన్ల కాళేశ్వరానికి కొదవలేదు

కోనాపూర్ కు ఏమడిగితే అదివ్వాలని కేసీఆర్ అన్నరు