కొవాగ్జిన్ ఫేజ్‌3 ట్రయల్స్.. పనితనం 77.8 శాతం

కొవాగ్జిన్ ఫేజ్‌3 ట్రయల్స్.. పనితనం 77.8 శాతం
  • ఫేజ్​3 ట్రయల్స్​లో తేలినట్టు లాన్సెట్‌‌‌‌‌‌‌‌ వెల్లడి

న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్ ఫార్మా సంస్థ భారత్​ బయోటెక్​ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్  కొవాగ్జిన్.. 77.8% బాగా పని చేస్తుందని లాన్సెట్‌‌‌‌‌‌‌‌​స్టడీ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్​ వల్ల ఎలాంటి సీరియస్​ సైడ్ ​ఎఫెక్ట్స్ ​కూడా లేవంది. ఫేజ్​3 ట్రయల్స్​లో  ఈ విషయం వెల్లడైనట్టు లాన్సెట్‌‌‌‌‌‌‌‌ జర్నల్‌‌‌‌‌‌‌‌లో రాశారు. టీకా వేసుకున్న వాళ్లలో కరోనాను కట్టడిచేసే యాంటీబాడీలు బాగా డెవలప్​అయ్యాయని వివరించింది. కొంత మందిలో తలనొప్పి, జ్వరం, అలసట, ఇంజెక్షన్ వేసిన ప్రాంతంలో నొప్పి లాంటి సైడ్​ఎఫెక్ట్స్ కనిపించాయంది. గతేడాది నవంబర్​ 16 నుంచి ఈ ఏడాది మే 17 వరకు ట్రయల్స్​ జరిగాయని.. 18 నుంచి ఆ పైబడిన వాళ్లు ట్రయల్స్​లో పాల్గొన్నారని తెలిపింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోని 25 హాస్పిటళ్లలో ట్రయల్స్​ చేశామంది. ప్రస్తుత ఇన్ఫర్మేషన్​ కేవలం ప్రిలిమినరీ స్టేజ్​లోనిదేనని.. కరోనాతో హాస్పిటల్​లో చేరిన, వైరస్​తో తీవ్రంగా ఇబ్బంది పడిన వాళ్ల శాంపుల్​ సైజ్​కూడా చేరిస్తే ఎంత ఎఫక్టివ్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తోందనేది తెలుస్తుందని చెప్పింది.  18 ఏండ్లు పైబడిన వాళ్లు కొవాగ్జిన్​ వేసుకొవచ్చని డబ్ల్యూహెచ్​వో ఇటీవలే అనుమతిచ్చింది. కరోనా వైరస్​ను ఇనాక్టివేట్​చేసి ఈ టీకాను తయారు చేశారు. వ్యాక్సిన్​ను రెండు డోసులుగా ఇస్తారు. 28 రోజుల తర్వాత రెండో డోసు వేస్తారు.