కొవాగ్జిన్ డోస్ రాష్ట్రాలకు రూ.600, ప్రైవేట్ దవాఖాన్లకు రూ.1200

కొవాగ్జిన్ డోస్ రాష్ట్రాలకు రూ.600, ప్రైవేట్ దవాఖాన్లకు రూ.1200


హైదరాబాద్: భారత్ బయోటెక్ కంపెనీ తన కరోనా టీకా ‘కొవాగ్జిన్’ ధరలను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వానికి రూ.150కి, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600కు, ప్రైవేట్ దవాఖాన్లకు రూ.1200కు ఒక డోసు చొప్పున అమ్మనున్నట్లు ఆ కంపెనీ చైర్మన్ కృష్ణ ఎల్లా శనివారం రాత్రి ట్విట్టర్ లో వెల్లడించారు. ఫారిన్ కంట్రీస్ కు ఎగుమతి చేసే టీకా ధర 15 నుంచి 20 డాలర్ల మధ్య ఉంటుందని తెలిపారు. మొత్తం ఉత్పత్తిలో 50 శాతం టీకాలను కేంద్ర ప్రభుత్వానికే కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, కొవాగ్జిన్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ ఫలితాలను ఆ కంపెనీ బుధవారమే ప్రకటించింది. ఈ టీకా 78 శాతం పనితీరు కనబరిచిందని తెలిపింది. దీన్ని తీసుకుంటే తీవ్రమైన కరోనా సింప్టమ్స్ తో ఆస్పత్రి పాలయ్యే అవకాశాలు నూరు శాతం లేవని ప్రకటించింది.

కొవిషీల్డ్ ధర రూ.400

ఆక్స్ ఫర్డ్ వర్సిటీ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా ధరలను పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇదివరకే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వానికి రూ.150కు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు, ప్రైవేట్ దవాఖాన్లకు రూ.600కు డోసు చొప్పున అమ్మనున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది.