
అమరావతి: ఏపీలో కరోనా పంజా విసురుతోంది. తాజాగా 89 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా ఇన్ఫెక్షన్ల బారిన పడిన వారి సంఖ్య 2,886 కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో వైరస్ కారణంగా ఎటువంటి మరణం సంభవించలేదని, ఇప్పటివరకు రాష్ట్రంలో 56 కరోనా మరణాలు నమోదయ్యాయని అక్కడి హెల్త్ మినిస్ట్రీ సోమవారం విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడించింది. కొత్త కేసుల్లో ఏడుగురు చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్నవారు కాగా.. 41 మంది ఫారిన్ నుంచి వచ్చిన వారేనని తెలిపింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 10,240 మంది శాంపిల్స్ టెస్ట్ చేశామని, వివిధ ఆస్పత్రుల నుంచి 41 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,848 కు చేరుకున్నట్లు ప్రకటించింది.