కరోనాకు ఎలాంటి వివక్షా లేదు.. మాస్కు తప్పనిసరి

కరోనాకు ఎలాంటి వివక్షా లేదు.. మాస్కు తప్పనిసరి

న్యూఢిల్లీ: కరోనా నుంచి రక్షణగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు కట్టుకోవాలని ఢిల్లీ ప్రజలను ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ కోరారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు మాస్కును వ్యాక్సిన్‌‌గా భావించాలన్నారు. ‘ఈమధ్య మాస్కులు కట్టుకోకుండా లేదా ముక్కు, నోరు పూర్తిగా కవర్ కాకుండా మాస్కును తప్పుగా ధరిస్తున్న చాలా మందిని గమనించా. ఇది మంచి పద్ధతి కాదు. కరోనాకు ఎలాంటి వివక్షా లేదని అందరూ గుర్తుంచుకోవాలి. పేద, ధనిక, యువత, వృద్ధాప్యం అనే తేడాల్లేకుండా అందరికీ వైరస్ సోకుతుంది. ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ నడుస్తోంది. పరిస్థితులు ఘోరంగా మారుతున్నాయి. డెంగ్యూను తరిమిన విధంగానే కరోనాపైనా పోరాడగలం. దీనికి మనం తీవ్రంగా శ్రమించాల్సి ఉంది’ అని కేజ్రీవాల్ చెప్పారు.