న్యూఢిల్లీ: తాజాగా కరోనా మెడిసిన్ కోవిఫర్ (రెమ్డిసెవిర్)ను లాంఛ్ చేసిన హెటెరో హెల్త్‌కేర్ ఈ మెడిసిన్‌ను దేశంలో వివిధ సిటీలకు సప్లయ్ చేయడానికి రెడీ అవుతోంది. కరోనా ట్రీట్‌మెంట్ కోసం మొత్తంగా 20 వేల వైల్స్(మెడిసిన్ ఉంచే బాటిల్స్)ను దేశంలోని వివిధ సిటీలకు డెలివరీ చేయనున్నామని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో తెలిపింది. ఈ మొదటి సెట్‌ను రెండు లాట్స్ కింద డెలివరీ చేయనుంది. ప్రతి లాట్‌లో పది వేల వైల్స్ ఉంటాయి. మొదటి లాట్‌ను హైదరాబాద్, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ముంబై, మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాలకు పంపనున్నారు. రెండో లాట్‌ను కోల్‌కతా, ఇండోర్, భోపాల్, ఇతర సిటీలకు డెలివరీ చేయనున్నారు. ఈ డెలివరీని వారంలోపే పూర్తి చేయనున్నామని హెటిరో పేర్కొంది. ఒక వైల్ ధరను రూ. 5,400 గా ఈ కంపెనీ ఫిక్స్ చేసింది. మరోవైపు ఫార్మా కంపెనీ సిప్లా కూడా రెమ్డిసెవిర్ జనరిక్ వెర్షన్‌ను ఇంకో 8–10 రోజుల్లో మార్కెట్లోకి తీసుకురానుంది. ఒక వైల్ ధర రూ. 5,000 కంటే తక్కువగానే ఉంటుందని సిప్లా పేర్కొంది. కోవిఫిర్‌ను తీసుకురావడం ఒక మైల్‌స్టోన్ అని హెటెరో హెల్త్‌కేర్ ఎండీ ఎం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ మెడిసిన్‌తో హాస్పిటల్‌లో కరోనా ట్రీట్‌మెంట్ టైమ్ తగ్గుతుందని, దీంతో మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్త్‌కేర్‌పై భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్‌కేర్‌కు కోవిఫిర్ తొందరగా అందేలా చేయడానికి ప్రభుత్వం, మెడికల్ కమ్యూనిటీతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ రెండు ఇండియన్ కంపెనీలూ కూడా యూఎస్ కంపెనీ గిలియాడ్ సైన్సెస్‌తో మాన్యుఫాక్చరింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి.
