హెర్డ్‌ ఇమ్యూనిటీతో కరోనాను అదుపు చేయలేం

హెర్డ్‌ ఇమ్యూనిటీతో కరోనాను అదుపు చేయలేం

హెల్త్‌ మినిస్ట్రీ
న్యూఢిల్లీ: మందగించే రోగ నిరోధక శక్తితో ఇండియాలో కరోనాను అదుపు చేయలేమని హెల్త్‌ మినిస్ట్రీ గురువారం తెలిపింది. దేశంలో కరోనాను కంట్రోల్ చేయాలంటే వ్యాక్సిన్‌పై ఆధారపడక తప్పదని స్పష్టం చేసింది. ‘మందగించే రోగ నిరోధక శక్తి (హెర్డ్ ఇమ్యూనిటీ) రోగం నుంచి పరోక్షంగా రక్షిస్తుంది. ఇది ప్రజలను వ్యాధి నుంచి కాపాడుతుంది. కానీ ఇది వ్యాక్సిన్‌ అభివృద్ధి అయినప్పుడు మాత్రమే డెవలప్ అవుతుంది. లేదా వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండాలి. హెర్డ్ ఇమ్యూనిటీ అనేది ఇండియాలో ఓ ఆప్షన్ కాదు. వ్యాక్సిన్ డెవలప్ అయిన తర్వాతే అది వృద్ధి చెందుతుంది’ అని హెల్త్ మినిస్ట్రీ అధికారులు న్యూస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 15 లక్షలు దాటిన విషయం తెలిసిందే.