కరోనా పొంచి ఉంది: మాస్క్ మర్చిపోవద్దు

కరోనా పొంచి ఉంది: మాస్క్ మర్చిపోవద్దు

పండుగల సీజన్ మొదలైంది. ఎంత వద్దనుకున్నా  ఫ్రెండ్స్, ఫ్యామిలీతో బయటకి వెళ్లాల్సి వస్తుంది. అయితే, మాస్క్ పెట్టుకోలేదో కరోనా కొత్త వేరియెంట్ జెఎన్1 ప్రమాదం పొంచి ఉంది. ఇది పాతరకం వైరస్ ల కంటే తొందరగా వ్యాప్తి చెందుతోంది. ఎన్ 95 మాస్క్ లేదంటే మూడు పొరల మాస్క్ పెట్టుకుంటే జెఎన్1 సోకకుండా జాగ్రత్తపడొచ్చు అంటున్నారు డాక్టర్లు. 

• రంధ్రాలు లేని ఎన్ 95 మాస్క్ పెట్టుకోవాలి. లేదంటే ఒకటి క్లాత్, రెండోది సర్జికల్ మాస్క్ అయినా ఓకే. 
• క్లాత్ మాస్క్ వాడేవాళ్లు వాటిని వాడిన ప్రతిసారి ఉతకాలి. మన ఇంట్లో వాళ్లే కదా అని ఒకరి మాస్క్ మరొకరు పెట్టుకోవద్దు. వదులుగా ఉండే మాస్క్ పెట్టుకుంటే రక్షణ ఉండదు. ముక్కు, నోరు, బుగ్గలు, గడ్డంని కప్పేసి, ఫిట్గా ఉండే మాస్క్ పెట్టుకోవాలి. 
• ఇంత పకడ్బందీగా మాస్క్ పెట్టుకుంటే శ్వాస తీసుకోవడం కష్టం అంటున్నారా! అయితే నోస్ క్లిప్ పెట్టుకోవచ్చు. 
• చేతితో పదేపదే మాస్క్ ని ముట్టుకోవద్దు. అంతేకాదు తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు మాస్క్ తీయొద్దు. మాస్క్ తీసిన ప్రతిసారి చేతులని శుభ్రం చేసుకోవాల్సిందే. అలాగని ప్రతిసారి చేతుల్ని కడగలేం. కాబట్టి చేతులకు శానిటైజర్ రాసుకోవాల్సిందే. 
• జనం మధ్యలో ఉన్నప్పుడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మాస్క్ తీయనే వద్దు.