ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు, వందకు చేరువలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 9652 కరోనా కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,261 కి పెరిగింది.
ఇక మరణాల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో 88 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. దీంతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2820కి చేరింది. 24 గంటల్లో చిత్తూరులో 14, ప్రకాశం 11, అనంతపూర్ 9, గుంటూరు 9, కర్నూలు 9, నెల్లూరు 7, పశ్చిమగోదావరి 6, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 5, విజయనగరం 5, తూర్పుగోదావరి 4, కృష్ణాలో 3, కడపలో ఒకరు కరోనాతో చనిపోయారు.

