తిరుమల : ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతు ఉంది. నగరాల నుంచి పల్లెల వరకు అన్ని చోట్లా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో ప్రతినిత్యం జారీ చేసే మూడు వేల సర్వదర్శనం టోకెన్లను తాత్కాలికంగా నిలివేస్తున్నట్లు వెల్లడించింది. కరోనా నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. రేపటి నుంచి సెప్టెంబర్ 30 వరకు టోకెన్ల జారీని నిలిపేస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది.
