యూకేలో బుధవారం సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను అందనుంది. యూకే హెల్త్ సర్వీస్ ఆధ్వర్యంలో సుమారు 50 ప్రాంతాల్లో సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే ఈ సందర్భంగా క్రెడిట్ కార్డ్ తరహాలో ఉండే కరోనా కార్డ్ లను వ్యాక్సిన్ వినియోగించుకున్న ప్రజలకు అందిస్తారు. ఈ కార్డ్ పై కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు, రెండో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారు అనే విషయాలు తెలుసుకోవచ్చు. తొలిసారి కరోనా వ్యాక్సిన్ వేయించుకునే సమయంలో ప్రజలు తమ వివరాల్ని ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డేటా బేస్ అంతా యూకే హెల్త్ సర్వీస్ కు అటాచై ఉంటుంది. తద్వరా తొలిసారి టీకా వల్ల ఎలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో సులభంగా గుర్తించవచ్చని యూకే ఆరోగ్య మంత్రి వాఘన్ తెలిపారు.
