
రియో డీ జెనీరియో: బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బొల్సొనారో కరోనా వ్యాక్సిన్‌లపై అటాక్ చేశారు. ముఖ్యంగా ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ప్రజలు మొసళ్లలాగా మారుతారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను కరోనా వ్యాక్సినేషన్ చేయించుకోబోనని మరోమారు స్పష్టం చేశారు. ‘ఫైజర్ కాంట్రాక్ట్‌లో ఒక విషయం స్పష్టంగా ఉంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా దానికి తాము బాధ్యులం క్లియర్‌గా ఉంది. ఒకవేళ మీరు మొసళ్లలాగా మారినా అది మీ సమస్యే కానీ దాంతో వారికి సంబంధం లేదు. వ్యాక్సిన్ తీసుకున్నాక మీరు సూపర్‌మ్యాన్‌గా మారినా, స్త్రీలకు గడ్డం వచ్చినా, పురుషులు మహిళల గొంతుతో మాట్లాడినా ఆ కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదంట’ అని బొల్సొనారో పేర్కొన్నారు.