స్పుత్నిక్ వీ ధర నిర్ణయించిన డాక్టర్ రెడ్డీస్

స్పుత్నిక్ వీ ధర నిర్ణయించిన డాక్టర్ రెడ్డీస్

న్యూఢిల్లీ: రష్యా నుంచి దిగుమతి చేసుకున్న స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ధర మొత్తానికి ఖరారైంది. వచ్చే వారం నుంచి దేశీ మార్కెట్ లోకి అందుబాటులోకి రానున్న ఈ టీకా ధరను రూ. 995గా డాక్టర్ రెడ్డీస్ సంస్థ నిర్ణయించింది. అసలు వెల రూ.948కి 5 శాతం జీఎస్టీతో కలిపి ఒక డోసుకు సుమారుగా రూ.995.40గా ధర ఉండే అవకాశం ఉంది. స్థానికంగా ఈ టీకా ఉత్పత్తి మొదలైతే ధర కొంత వరకు తగ్గొచ్చునని స్పుత్నిక్ ను లోకల్ గా తయారు చేయనున్న రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తెలిపింది. సమయానుగుణంగా డిమాండ్ మేర టీకా డోసులను అందించేందుకు తమ భాగస్వామ్య కంపెనీలతో కలసి పని చేస్తున్నామని స్పష్టం చేసింది.