నిమ్స్ లో మ‌నుషుల‌పై క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ : పాజిటీవ్ రెస్పాన్స్ వ‌స్తుంద‌న్నసైంటిస్ట్ లు

నిమ్స్ లో మ‌నుషుల‌పై క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ : పాజిటీవ్ రెస్పాన్స్ వ‌స్తుంద‌న్నసైంటిస్ట్ లు

మ‌నుషుల‌పై ప్ర‌యోగిస్తున్న క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ లో పాజిటీవ్ రెస్పాన్స్ వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్ ‘కోవాగ్జిన్‌’ పేరిట టీకాను త‌యారు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ టీకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే మ‌నుషుల‌పై ప్ర‌యోగించాలి. ఈ ప్ర‌యోగంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న 375 మంది వలంటీర్లపై మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్ ప్రారంభమ‌య్యాయి.
ఇక హైద‌రాబాద్ నిమ్స్ లో వాలంటీర్ల‌పై ఈ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ ప్రారంభ‌మ‌య్యాయి. మొదటి ఫెజ్ లో భాగంగా ఒక వాలంటీర్ కు వ్యాక్సిన్ డోస్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఆ వ్యాక్సిన్ ఇచ్చిన వాలంటీర్ హెల్దీగా ఉన్నార‌ని, శాంపిల్స్ ను ఢిల్లీకి పంపించి..హెల్త్ చెకప్ లు చేస్తున్నారు. ఢిల్లీకి పంపిన శాంపిల్స్ లో పాజిటీవ్ వ‌స్తే..రెండు, మూడు ద‌శ‌ల్లో భార‌త్ బ‌యోటెక్ త‌యారు చేసిన క‌రోనా వ్యాక్సిన్ డోస్ ‘కోవాగ్జిన్‌’ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.