అవసరం ఉన్న వారికే వ్యాక్సినేషన్: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్

అవసరం ఉన్న వారికే వ్యాక్సినేషన్: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి పలు దేశాలు లాక్ డౌన్ ను అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎకానమీ పడిపోతోందనే ఉద్దేశంతో ఇండియాతో పాటు చాలా దేశాలు లాక్ డౌన్ ను నుంచి అన్ లాక్ షిఫ్ట్ అయ్యాయి. అలాగే మహమ్మారిని కంట్రోల్ చేసే యత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ అనేది మొద్దుబారిన పరికరం లాంటిదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కచ్చితమైన జాగ్రత్త చర్యలు చేపడుతూ అన్ని దేశాలు కూడా దేశవ్యాప్త లాక్ డౌన్ ను వేయబోవని ఆశాభావం వ్యక్తం చేశారు. కచ్చితమైన లక్ష్యాలను సాధించడానికి కొన్ని దేశాలు డేటా డ్రివెన్ అప్రోచ్ ను అవలంభిస్తున్నాయని చెప్పారు.

ప్రభావవంతమైన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దాన్ని అంతే ఎఫెక్టివ్ గా వాడాల్సిన అవసరం ఉందని టెడ్రోస్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ నేషనలిజంతో మహమ్మారి మరికొంత కాలం కొనసాగుతుంది కానీ అంతమవ్వబోదని నొక్కి చెప్పారు. వ్యాక్సిన్ సప్లయి తక్కువగా ఉన్నప్పుడు ఎస్సెన్సిషయల్ వర్కర్స్ కు వ్యాక్సినేషన్ చేయాలన్నారు. అన్ని దేశాల్లోని అందరు ప్రజలకు వ్యాక్సిన్ ను అందించడం కంటే అన్ని దేశాల్లోని అవసరమైన కొందరు ప్రజలకే వ్యాక్సినేషన్ చేస్తే సరిపోతుందని సూచించారు.