దేశంలో విజృంభిస్తున్న కరోనా

దేశంలో విజృంభిస్తున్న కరోనా

ఢిల్లీ : దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వాలు వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. గత వారం రోజుల్లో కోవిడ్ కేసుల సంఖ్య 6.3 రెట్లు పెరిగిందని కేంద్రం ప్రకటించింది. గతేడాది డిసెంబర్ 29న 0.79 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు జనవరి 5 నాటికి 5.03శాతానికి చేరిందని చెప్పింది. ముఖ్యంగా 8 రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఆందోళన కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.మహారాష్ట్ర, బెంగాల్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, కర్నాటక, జార్ఖండ్, గుజరాత్లలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. దేశంలో 28 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతానికి పైగా ఉందని అన్నారు. 

రాజస్థాన్లో ఒమిక్రాన్తో ఒక వ్యక్తి మృతి చెందారన్న వార్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది. మృతునికి డయాబెటిస్తో పాటు ఇతర వ్యాధులు ఉన్నప్పటికీ టెక్నికల్గా అది ఒమిక్రాన్ మరణమేనని చెప్పింది. ఇదిలా ఉంటే బుధవారం దేశవ్యాప్తంగా కొత్తగా 58,097 మంది కరోనా బారినపడగా.. 534 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ పేషెంట్ల సంఖ్య 2వేలు దాటింది. దేశంలో మొత్తం 2,135 మంది ఒమిక్రాన్ బారిన పడగా.. 828 మంది కోలుకున్నారు. 

For more news...

ఫ్లై ఓవర్పై చిక్కుకుపోయిన ప్రధాని మోడీ

తమిళనాడులో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ