కోవిడ్ ఎఫెక్ట్ : అక్కడి ఉద్యోగులు ఇంటి నుంచే పని

కోవిడ్ ఎఫెక్ట్ : అక్కడి ఉద్యోగులు ఇంటి నుంచే పని

తైవాన్, సింగపూర్ మాదిరిగా కాకుండా, హాంకాంగ్ చైనాకు బోర్డర్ లోనే ఉంది. చైనాలో భాగంగానే ఉండటం వల్ల రోజూ 3 లక్షల మంది వచ్చిపోతుంటారు. అందుకే.. చైనా నుంచి వచ్చేవాళ్లను కంట్రోల్ చేయడంపై కాకుండా, లోకల్ గా రోగం వ్యాపించకుండా చూడటంపైనే హాంకాంగ్ అధికారులు ఫోకస్ పెట్టారు. వుహాన్ లో కొవిడ్–19 కేసులు వెలుగు చూడగానే, హాంకాంగ్ అధికారులు బోర్డర్ లో ప్రతి ఎంట్రీ పాయింట్ వద్దా థర్మల్ స్క్రీనింగ్ ప్రారంభించారు.

ఐదు రోజుల తర్వాతే ప్రయాణాలపై ఆంక్షలు పెట్టారు. ఫిబ్రవరి 5 తర్వాత చైనా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ 14 రోజుల క్వారంటైన్లకు పంపారు. గవర్నమెంట్ కట్టించిన కొత్త ఇండ్లను క్వారంటైన్లుగా మార్చారు. ఇప్పటికీ 2,47000 మందిని క్వారంటైన్లలో ఉంచారు. భారీ ప్రోగ్రాంలను రద్దు చేశారు. స్కూళ్లకు ఏప్రిల్ వరకూ సెలవులు ప్రకటించారు. వీలైన ప్రతి డిపార్ట్ మెంట్ లోనూ ఉద్యోగులను నెలరోజుల పాటు ఇంటి నుంచే పనిచేయాలని చెప్పారు.