కోవిడ్ పై ఆందోళన అవసరం లేదు

కోవిడ్ పై ఆందోళన అవసరం లేదు

కేరళలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని మూడు జిల్లాలైన ఎర్నాకుళం, తిరువునంతపురం, కొట్టాయంలో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ తెలిపారు.కోవిడ్ పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి..ప్రస్తుతం రాష్ట్రంలో అంటువ్యాధుల సంఖ్య స్వల్పంగా పెరిగినప్పటికీ..ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యే జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో కోవిడ్ పరీక్షలను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. కోవిడ్ మహమ్మారి శాశ్వతంగా పోలేదని..ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. 

మరిన్ని వార్తల కోసం

పబ్లో అశ్లీల నృత్యాలు.. పలువురు అరెస్ట్

బస్తీ ప్రజలకు వరద ముంపు నుండి విముక్తి