12 నుంచి 14 ఏళ్ల లోపు  పిల్లలకు మార్చి నుంచి  టీకాలు

12 నుంచి 14 ఏళ్ల లోపు  పిల్లలకు మార్చి నుంచి  టీకాలు

భారత్ లో ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకాలు ఇచ్చే కార్యక్రమంలో ప్రారంభమైనంది. ఇప్పుడు12 నుంచి 15 ఏళ్ల లోపు వారికి కూడా మార్చి నుంచి  కరోనా టీకాలు ఇచ్చేందుకు కేంద్రం  ప్రారంభించే అవకాశముందని  నేషనల్ టెక్నికల్  అడ్వజరీ గ్రూప్  ఆప్  ఇమ్యూనైజేషన్ (NTAGI)కి చెందిన జాతీయ కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ ఎన్.కె.అరోరా ఇవాళ(సోమవారం) తెలిపారు. అప్పటి వరకు 15-18 ఏళ్ల లోపు వారికి  వ్యాక్సినేషన్ పూర్తయ్యే అవకాశముందన్నారు. దేశంలో 15 నుంచి 18 ఏళ్ల లోపు వారు 7.4 కోట్ల మంది ఉన్నారని, వారిలో 3.45 కోట్ల మంది తొలి డోసు తీసుకున్నట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి  మన్ సుఖ్ మాండవీయ

ట్విట్టర్ వేదికగా తెలిపారు. 28 రోజుల వ్యవధితో రెండో డోసు తీసుకుంటారన్నారు.

మరిన్ని వార్తల కోసం..

దక్షిణాది రాష్ట్రాలపై కొవిడ్ పంజా