దక్షిణాది రాష్ట్రాలపై కొవిడ్ పంజా  

దక్షిణాది రాష్ట్రాలపై కొవిడ్ పంజా  
  • దక్షిణాది రాష్ట్రాలపై కొవిడ్ పంజా  
  • వచ్చేవారం భారీగా పెరగనున్న కేసులు

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొద్ది రోజుల నుంచి ఢిల్లీ, ముంబై, కోల్ కతా నగరాల్లో కరోనా థర్డ్ వేవ్ ఉథృతంగా కనిపించింది. ఎవరూ ఊహించని విధంగా కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. కానీ ఇప్పుడు ఈ నగరాల్లో రోజువారీ కేసులు క్రమేణా తగ్గుముఖం పడుతున్నాయని ఐఐటీ ప్రొఫేసర్ మనీంద్రా అగర్వాల్ తెలిపారు. రాబోయే రెండు వారాల్లో ఇతర రాష్ట్రాల్లో కరోనా థర్డ్ వేవ్ పీక్ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. ఈ వారం మహారాష్ట్ర, గుజరాత్, హర్యానాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. అయితే రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో వచ్చే వారం కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతాయని చెబుతున్నారు. కరోనాను కట్టడి  చేయాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.