ఆన్​లైన్​లో కొవిసెల్ఫ్​

ఆన్​లైన్​లో కొవిసెల్ఫ్​

న్యూఢిల్లీ: కరోనా సెల్ఫ్‌‌ టెస్టింగ్‌‌ కిట్‌‌ (కొవిసెల్ఫ్‌‌) రెండు, మూడ్రోజుల్లో ఫార్మసీల్లో అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌‌కార్ట్‌‌లో కూడా ఇది లభించనుంది. ‘కొవిసెల్ఫ్‌‌’ను మై ల్యాబ్‌‌ డిస్కవరీ సొల్యూషన్స్‌‌ డెవలప్‌‌ చేసింది. రూ.250కు లభించే ఈ సెల్ఫ్‌‌ టెస్టింగ్ కిట్‌‌.. గవర్నమెంట్‌‌ ఈ–మార్కెట్‌‌లో కూడా దొరికే చాన్స్ ఉంది. ‘ఇండియాలో తయారు చేసిన ఈ కిట్‌‌.. 95 శాతం పిన్‌‌కోడ్‌‌లకు పంపిణీ చేయబడుతుంది. దేశంలోని అన్ని ఫార్మసీలు, మందుల షాపుల్లో దొరుకుతుంది. ఫ్లిప్‌‌కార్ట్‌‌లో ఆన్‌‌లైన్‌‌లో కూడా ఆర్డర్ చేయవచ్చు’ అని మై ల్యాబ్‌‌ స్టేట్‌‌మెంట్‌‌లో తెలిపింది. వారానికి 7 లక్షల యూనిట్లు అందుబాటులోకి తేవడానికి మై ల్యాబ్ సంస్థ రెడీగా ఉంది. ‘సెల్ఫ్‌‌ టెస్టింగ్‌‌ ద్వారా దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టే చాన్స్ ఉంది. రూరల్ ఏరియాల్లో నివసించే వారికి టెస్ట్‌‌ చేసుకోవడానికి తక్కువ ఆప్షన్స్ ఉంటాయి.దేశంలోని అన్ని ప్రాంతాల్లో కొవిసెల్ఫ్‌‌ను అందుబాటులోకి తేవాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నాం’ అని మై ల్యాబ్ మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌ హస్ముఖ్‌‌ రావల్‌‌ తెలిపారు. ‘టెస్టు చేయడానికి 2 నిమిషాలు, రిజల్ట్‌‌కు 15 నిమిషాల సమయం పడుతుంది. మాన్యువల్‌‌ చదివి ఎవరైనా టెస్టు చేసుకోవచ్చు. ఐసీఎంఆర్‌‌‌‌ ప్రకారం.. కొవి సెల్ఫ్‌‌తో చేసిన టెస్ట్‌‌లో పాజిటివ్‌‌ అని తేలితే.. ఆర్టీపీసీఆర్ టెస్ట్ అవసరం లేదు’ అని మై ల్యాబ్ డైరెక్టర్‌‌‌‌ సుజీత్‌‌ జైన్ చెప్పారు. కొవి సెల్ఫ్‌‌కు ఐసీఎంఆర్‌‌‌‌ మే నెలలో అనుమతి ఇచ్చింది.